మంగళ చరణ గజాననా
గజవదన శుభాననా
మంగళ చరణ గజాననా
విద్యాదాయక బుద్ధిదాయక
గౌరీ తనయ గజాననా (2)
లంబోదర హే గజాననా
గజవదన శుభాననా //మంగళ//
శుభకరణమ్ హే దుఃఖవినాశక
ఐశ్వర్యక గజాననా (2)
సిందూరవదన గజాననా
గజవదన శుభాననా //మంగళ//
విఘ్న వినాశక పుణ్యఫల పాలక
సిద్ధి వినాయక గజాననా (2)
సూక్ష్మాంబరధారీ గజాననా
గజవదన శుభాననా
మంగళ చరణ గజాననా